News August 10, 2024
కోనసీమ: కూలీల ఆటోను ఢీకొట్టిన RTC బస్సు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కూడలి వద్ద శనివారం ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని అమలాపురం ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం నుంచి పి.గన్నవరం మండలం ముంగండ రొయ్యల పరిశ్రమలో పని కోసం 11 మంది ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Similar News
News December 8, 2025
రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

డిసెంబర్ 8న (సోమవారం) జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ నుంచి సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పౌర సేవల కోసం వాట్సాప్ నంబర్ 95523 00009 అందుబాటులో ఉందని తెలిపారు. ఫిర్యాదుదారులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

News December 7, 2025
రౌడీషీటర్లకు ఎస్పీ హెచ్చరిక

తూర్పుగోదావరి ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలతో ఆదివారం జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్‌హెచ్‌ఓల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేరస్తుల ప్రవర్తనపై ఆరా తీశారు. అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని, మళ్లీ చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాల్లో భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.