News April 2, 2024
కోనసీమ జిల్లాకు రేపు చంద్రబాబు రాక

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు రేపు(బుధవారం) రానున్నారు. కొత్తపేట, ద్రాక్షారామ నందు నిర్వహించనున్న బహిరంగ సభలకు ఆయన హాజరవుతారని టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఈ సభలో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారన్నారు.
Similar News
News February 19, 2026
కొవ్వూరు మున్సిపాలిటీపై పసుపు జెండా

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ పీఠం TDP పరమైంది. YCP మున్సిపల్ ఛైర్‌పర్సన్ బావన రత్నకుమారితో పాటు నలుగురు కౌన్సిలర్లు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో బుధవారం TDPలో చేరారు. దీంతో ఎమ్మెల్యేతో కలిపి కూటమి బలం 14కు చేరి స్పష్టమైన మెజారిటీ లభించింది. గత ఎన్నికల్లో YCP గెలిచినప్పటికీ, తాజా మార్పులతో కొవ్వూరు మున్సిపాలిటీని TDP కైవసం చేసుకుంది.
News February 19, 2026
తూ.గో: భూ రికార్డుల సవరణ ఇక ఈజీ!

రెవెన్యూ రికార్డులైన వెబ్‌ల్యాండ్, ఆడంగల్‌లో మార్పులు చేసే అధికారాలను RDOలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని RDO కృష్ణనాయక్ తెలిపారు. మ్యూటేషన్ ప్రక్రియ కూడా ఇకపై డివిజన్ స్థాయిలోనే పూర్తవుతుందన్నారు. దీనివల్ల పౌరసేవలు వేగవంతమై ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని వివరించారు. భూసమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.