News March 7, 2025

కోనసీమ జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. కోనసీమ జిల్లా వాసులు ఎక్కువగా కాకినాడ, రాజమండ్రి వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లాలలోని విద్యాసంస్థలతో చదివేవారు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా కోనసీమ జిల్లా దాటితే కాకినాడ,తూ.గో వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.

Similar News

News February 12, 2026

సిద్దిపేట: 10వ తరగతి మొదటి మైలురాయి: DEO

image

విద్యార్థి జీవితంలో 10వ తరగతి మొదటి మైలురాయని, దానిని ఏకాగ్రతతో అధిగమించాలని DEO శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం విపంచి కళానిలయంలో 10 విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చదువును ఇష్టపడి చదివితే కష్టం కాదన్నారు. ఈ విద్యా సంవత్సరం 10 పరీక్ష ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. బిస్మాట్ స్టేట్ సెక్రటరీ జగ్గు మల్లారెడ్డి ఉన్నారు.

News February 12, 2026

GNT: 21న జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం

image

గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు వెల్లడించారు. జడ్పీ ఛైర్‌పర్సన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, సభ్యులందరూ సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

News February 12, 2026

చిత్తూరు: YCP కమిటీ నియామకాల విడుదల

image

చిత్తూరు జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల కమిటీ నియామకాలు జరిగాయి. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వివరాలు విడుదల చేశారు. డిస్ట్రిక్ట్ యూత్ వింగ్ సెక్రటరీగా పుంగనూరు కమతంపల్లికి చెందిన కొమ్మిరి కుమార్, డిస్ట్రిక్ట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా ఈశ్వర్ నియమితులయ్యారు. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు.