News June 17, 2024
కోనసీమ జిల్లాలో రామోజీరావు విగ్రహం తయారీ

కొత్తపేట శిల్పి రాజ్‌కుమార్ వుడయార్ ‘ఈనాడు’ అధినేత రామోజీరావు విగ్రహాన్ని తయారు చేశారు. విజయనగరం MP అప్పలనాయుడు దీన్ని తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. 7.5 అడుగుల ఎత్తుతో 4 రోజుల్లోనే తయారు చేశానని, 25 విగ్రహాలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ‘ఈనాడు’ ప్రస్థానం ప్రారంభమైన విశాఖలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఎంపీ తెలిపారు. మీడియా రంగం నుంచి ప్రతిష్ఠించే తొలి విగ్రహం రామోజీరావుదే కావడం గమనార్హం.
Similar News
News January 22, 2026
బీజేపీ ఎస్సీ మోర్చా ‘గోదావరి జోన్ ఇన్‌ఛార్జ్’గా సుమన్ బాబు

రాష్ట్ర ఎస్సీ మోర్చా గోదావరి జోన్-2 ఇన్‌ఛార్జ్‌గా దేవరపల్లికి చెందిన దున్న సుమన్ బాబు నియమితులయ్యారు. ఈమేరకు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ నియమాక ఉత్తర్వులు జారీచేసారు. సుమన్ బాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, తూ.గో జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పణతల సురేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
News January 21, 2026
హైదరాబాద్‌లో అద్దెకు కారు తీసుకుని అనపర్తిలో అమ్మేశారు

అవసరం కోసం హైదరాబాదులో కారును అద్దెకు తీసుకుని అనపర్తిలో అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఈశ్వర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. హైదరాబాద్‌లో డిసెంబర్ 3న హరీష్ అనే వ్యక్తి కారును అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పారిపోయాడు. జీపీఎస్ ద్వారా కారు తోకాడలో ఉందని తెలిసి వచ్చి అడగగా దౌర్జన్యం చేసి కొట్టారు. అనంతరం కారును అనపర్తిలో అమ్మారు.
News January 21, 2026
ధవళేశ్వరంలో ఒకరి మృతి.. నలుగురికి గాయాలు

ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద నిర్మిస్తున్న పంపు హౌస్ స్లాబ్ నిర్మాణ పనులు చేపడుతుండగా ప్రమాదం సంభవించింది. స్లాబ్ వేస్తుండగా బుధవారం సెంట్రింగ్ కూలిపోయింది. దీంతో నిర్మాణపనులు చేస్తున్న కూలీల్లో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


