News August 13, 2025

కోనసీమ నుంచి ఆ 2 నియోజకవర్గాలు వేరవుతాయా?

image

జిల్లాల పున:వ్యవస్థీకరణలో మండలాల సరిహద్దుల మార్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గాన్ని తూ.గోలో, రామచంద్రపురాన్ని కాకినాడలో విలీనం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో 7 నియోజకవర్గాలు కలిగి ఉన్న జిల్లా పరిధి కుచించుకుపోతుందా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. లేదా చివరకు మరేదైనా ప్రతిపాదన తెరపైకి వస్తుందా అనేది చూడాలి.

Similar News

News March 14, 2026

MBNR: ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొడతా లేదని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సిలిండర్ల విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందకూడదన్నారు. సంక్షేమ హాస్టల్లో హాస్పిటళ్లు విద్యాసంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదని వెల్లడించారు.

News March 14, 2026

మరి కాసేపట్లో గుత్తికొట ఉత్సవాలు ప్రారంభం

image

గుత్తి ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో నేటి నుంచి ప్రారంభం కానున్న గుత్తి కోట ఉత్సవాలు మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు ప్రజలు ఒక్కొక్కరుగా వస్తున్నారు. స్టేజ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కోట ఉత్సవాలు 2 రోజుల పాటు జరగనున్నాయి.

News March 14, 2026

విజయవాడ: రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు వేదిక మార్పు

image

విజయవాడలో ఈ నెల 16న ప్రభుత్వం నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందు వేదిక మారినట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశా తెలిపారు. గతంలో నిర్ణయించిన ఏ1 కన్వెన్షన్ సెంటర్‌కు బదులుగా, ఇప్పుడు ఏ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మత పెద్దలు, ప్రజాప్రతినిధుల కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.