News March 12, 2025

కోన శశిధర్‌కు తిరుపతి జిల్లా బాధ్యతలు

image

తిరుపతి జిల్లా ప్రత్యేకాధికారిగా కోన శశిధర్ IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్‌కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు.

Similar News

News February 19, 2026

బాల్క సుమన్ గొడవ క్రియేట్ చేశారు: వివేక్

image

క్యాతన్‌పల్లిలో బాల్క సుమన్ అరెస్ట్‌ను ఖండించిన ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికకు వస్తున్న ఎంపీ, మంత్రి వాహనాలపై రాళ్లు రువ్విన వారికి ఎలా సపోర్ట్ చేస్తారని నిలదీశారు. అసలు అక్కడ గొడవ జరగలేదని.. సుమన్ కావాలని గొడవ క్రియేట్ చేశారని మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకోలేదని, కావాలనే తమపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆగ్రహించారు.

News February 19, 2026

భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

image

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.