News August 21, 2025
కోరుట్ల: రాజశ్రీకి ASIగా పదోన్నతి

కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజశ్రీ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI )గా పదోన్నతి పొందారు. ఈ సందర్బంగా గురువారం ఆమెకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ASI పదోన్నతి స్టార్ చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు. పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు.
Similar News
News January 16, 2026
విజయనగరంలో కేజీ చికెన్ రూ.240

నేడు కనుమ పండగ సందర్భంగా మాంసం ప్రియులకు తిందాం అని ఉన్నా శుక్రవారం సెంటిమెంట్‌తో ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో చికెన్, మటన్ షాపులు కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. కాగా నగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతుండగా.. చికెన్ (స్కిన్) రూ.260, స్కిన్ లెస్ రూ.240, రొయ్యలు రూ.350/250, చేపలు రూ.170 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
News January 16, 2026
భిక్కనూర్: అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన కారు

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు పెద్దమల్లారెడ్డి నుంచి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు సేఫ్‌గా బయటపడ్డారు.
News January 16, 2026
ప్రొద్దుటూరులో అవినీతిపై చర్యలు ఏవీ..?

ప్రొద్దుటూరు ప్రభుత్వ శాఖల్లోని అవినీతిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీ పెట్రోల్ బంకులో రూ.కోట్లల్లో స్కాం జరిగినట్లు ఆడిట్ గుర్తించినా రికవరీ లేదు. అగస్త్యేశ్వరాలయంలో బంగారు, వెండి, నగదు ఇంటి దొంగలు కొట్టేసినా చర్యలులేవు. పేజ్-3లో కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు చేయకపోయినా చర్యలు లేవు. హౌస్ బిల్డింగ్ సొసైటీలో అక్రమాలపై MLA ఫిర్యాదు చేసినా రికవరీ లేదు.


