News November 5, 2025
కోర్టుకు పాస్‌పోర్ట్ అప్పగించిన రాజంపేట MP

ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనడానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటన ముగియడంతో ఆయన ఇండియాకు వచ్చారు. మద్యం కేసులో ఆయనకు కండిషనల్ బెయిల్ వచ్చింది. పాస్‌పోర్ట్‌ను కోర్టులో సమర్పించాలని అప్పట్లోనే ఆదేశించింది. అమెరికా వెళ్లే ముందు ఆయన పాస్‌పోర్టు తీసుకోగా.. ఇవాళ కోర్టులో తిరిగి సమర్పించారు.
Similar News
News January 19, 2026
UPI ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా.. ఎంత తీసుకోవచ్చంటే?

ఏప్రిల్ నుంచి UPI ద్వారా PF సొమ్మును సభ్యులు విత్ డ్రా చేసుకునేందుకు EPFO ఏర్పాట్లు చేస్తోంది. ట్రాన్సాక్షన్‌కు గరిష్ఠంగా రూ.25 వేలు వరకు తీసుకోవచ్చని తెలుస్తోంది. విత్ డ్రాకు అర్హత ఉన్న బ్యాలెన్స్, మినిమమ్ బ్యాలెన్స్(25%)ను విడిగా చూపిస్తుందని సమాచారం. దీనిపై EPFO, C-DAC, NPCI మధ్య చర్చలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా BHIM యాప్ ద్వారా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుందని చెప్పారు.
News January 19, 2026
జగిత్యాల జిల్లాలో 6వ రోజు తనిఖీలు

జగిత్యాల జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఆదివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బ్రీత్ అనలైజర్లతో వాహనదారులను పరీక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేయడమే కాకుండా జైలు శిక్ష కూడా తప్పదని పోలీసులు హెచ్చరించారు.
News January 19, 2026
నాన్న ఎదుట ఏడ్చేవాడిని: హర్షిత్ రాణా

తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ గురించి భారత క్రికెటర్ హర్షిత్ రాణా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘పదేళ్లపాటు నేను ఎంపిక కాలేదు. ట్రయల్స్‌కు వెళ్లడం, నా పేరు ఉండకపోవడం జరిగేది. ఇంటికొచ్చి నాన్న ఎదుట ఏడ్చే వాడిని. ఇప్పుడు ఆ వైఫల్యాలు పోయాయని భావిస్తున్నా. ఏం జరిగినా ఎదుర్కోగలను’ అని చెప్పారు. ఇప్పటిదాకా 14 వన్డేలు ఆడిన హర్షిత్ 26 వికెట్లు పడగొట్టారు. NZతో మూడో వన్డేలో 3 వికెట్లు తీశారు.


