News March 26, 2024

కోవూరు : అమ్మకు అండగా అర్జున్ రెడ్డి

image

కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాజకీయ వ్యవహారాలలో ఆమె కుమారుడు డాక్టర్ అర్జున్ రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. నెల్లూరులోనే మకాం వేసి పాత పరిచయాలు, బంధుత్వాలను సమన్వయం చేసుకుంటూ పలువురు నేతలను వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Similar News

News February 13, 2026

నెల్లూరుకు మంచి రోజులు వస్తున్నాయి..!

image

నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. రూ.1000 కోట్లతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ పెట్టనుంది. రాకెట్‌లో వినియోగించే పేలుడు పదార్థాలను ఈ సంస్థ తయారు చేయనుంది. దుత్తలూరు మండలం రాచవారిపల్లి, బ్రహ్మేశ్వరం పరిధిలో వీరికి 500 ఎకరాలు కేటాయించనున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తి చేసే రెనైసెన్స్ అనే మరో సంస్థ సైతం రూ.4వేల కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది.

News February 13, 2026

నెల్లూరు జిల్లాలో ఆ సర్పంచ్ తొలగింపు

image

పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వెంకటాచలం సర్పంచ్ మందల రాజేశ్వరిపై గతంలోనే సస్పెన్షన్ వేటుపడింది. తాజాగా గురువారం ఆమెను శాశ్వతంగా తొలగిస్తూ నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ అధికార దుర్వినియోగంతో తన భర్త వెంకటశేషయ్య అకౌంట్‌లోకి అక్రమంగా నగదు తరలింపు, నిధుల దుర్వినియోగం నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News February 13, 2026

నెల్లూరు: రైతు మెడకు ఉరితాడు..!

image

అకాల వర్షాలు, కరవు, పెరిగిన సాగు ఖర్చులు, అధిక వడ్డీల భారం రైతు మెడకు ఉరితాడుగా మారుతున్నాయి. జిల్లాలో 2021(2), 2022(6), 2023(1), 2024(3), 2025(3) చొప్పున 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 8 మందికి రూ.7లక్షలు చొప్పున రూ.56 లక్షలు పరిహారం అందగా, 3 దరఖాస్తులు రిజెక్ట్ చేయగా, 3 ప్రతిపాదనలు పంపగా.. ఒకరిది అగ్రికల్చర్ లాగిన్లోకి రాలేదు. ప్రభుత్వాలు పంటకు మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.