News August 24, 2024

కోవూరు: పవన్‌పై అభ్యంతరకర పోస్టులు.. ఉద్యోగి సస్పెండ్

image

సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర పోస్టులు పెట్టి ఉద్యోగ నిబంధనలు ఉల్లంఘించిన సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ రవిశంకర్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సహకార శాఖ రిజిస్ట్రార్, కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవ్వూరుకు చెందిన చౌదరి ఇతనిపై కమిషనర్‌, మంత్రికి ఈ నెల 21న ఫిర్యాదు చేయగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కొవ్వూరు నుంచి బదిలీపై విజయవాడకు వెళ్లారు.

Similar News

News September 18, 2024

సీఎం చంద్రబాబుతో సమావేశం.. హాజరైన మంత్రి నిమ్మల

image

చెల్లించకుండా పెండింగ్ లో ఉన్న నీరు చెట్టు బిల్లుల విడుదలకు సంబంధించి మంగళవారం సీఎం చంద్ర‌బాబుతో మంత్రులు ప‌య్యావుల కేశ‌వ్, నిమ్మ‌ల రామానాయుడు, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ కలిసి చర్చించారు. చర్చల అనంతరం ద‌శ‌ల వారీగా నీరు చెట్టు బిల్లులను విడుద‌ల చేయాల‌ని ఆర్థిక శాఖ‌ను ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు.

News September 18, 2024

ప.గో జిల్లాలో పొగాకు మళ్లీ ఆల్ టైం రికార్డ్ ధర

image

ఉమ్మడి జిల్లాలోని ఎన్‌ఎల్‌ఎస్‌ ఏరియా పరిధిలోని పొగాకు ధర రికార్డు బద్దలు కొట్టింది. మంగళవారం జంగారెడ్డిగూడెం-1, జంగారెడ్డిగూడెం-2, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో అత్యధికంగా రూ.408 నమోదయ్యింది. దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.400, గోపాలపురంలో రూ.399 ధర పలికింది. మొత్తం ఐదు వేలం కేంద్రాల్లో 6,669 బేళ్లు రైతులు అమ్మకానికి తీసుకురాగా, వీటిలో 4,444 బేళ్లు అమ్ముడైనట్లు రైతులు పేర్కొన్నారు.

News September 18, 2024

ఏలూరు: లాయర్ మృతి.. ఫ్యామిలీ పైనే కేసు

image

ఏలూరుకు చెందిన లాయర్ కార్తీక్ గత నెల మృతి చెందిన విషయం తెలిసిందే. ఏలూరు 2 టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. కార్తీక్ HYDలో వేరే కులానికి చెందిన మనీషాను 2017లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్య తరఫువాళ్లు కుల వివక్ష చూపేవారు. 2023లో భార్య పుట్టింటికి వెళ్లిపోయి, తన వారితో కేసులు పెట్టించడంతో మనోవేదనకు గురై మృతి చెందారు. మృతుని తండ్రి ఫిర్యాదుతో అతని భార్య, మరో ఐదుగురిపై కేసు నమోదైనట్లు తెలిపారు.