News May 1, 2024
కోవూరు MLA అభ్యర్థిపై కేసు నమోదు

వైసీపీ కోవూరు MLA అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మండలంలోని కొత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా విమర్శలు చేసినట్లు ఎంపీడీఓ సాయిలహరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Similar News
News December 16, 2025
నెల్లూరులో మరో లేడీ డాన్.. ఇకపై వివరాలు చెబితే ప్రైజ్ .!

నెల్లూరులో పదేళ్లుగా గంజాయి అమ్ముతున్న షేక్ ముంతాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు DSP ఘట్టమనేని తెలిపారు. స్థానికుల సమాచారంతో దాడులు చేయగా నిందితురాలి ఇంటిలో 20.90కిలోల గంజాయి లభ్యం అయిందన్నారు. దీంతో ఆమెతోపాటు కుమారులు సిరాజ్, జమీర్, కోడలు సుభాషిణితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. యువత ఇలాగే సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటూ నగదు రివార్డ్ ఇస్తామని DSP పేర్కొన్నారు.
News December 16, 2025
నెల్లూరు జిల్లాకు TDP కొత్త బాస్ ఈయనే.!

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర యాదవ్ పేరు ఖరారైంది. కాగా అధికారిక ప్రకటన విడుదల కావల్సి ఉంది. ప్రస్తుతం రవిచంద్ర టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాయలసీమ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. గతంలోనూ ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.
News December 16, 2025
నెల్లూరు జిల్లాకు జోన్-4 కేటాయింపు

APలోని 26 జిల్లాలను జోన్‌ల వారీగా విభజించే క్రమంలో నెల్లూరు జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-4గా చోటుదక్కింది.


