News May 13, 2024

కౌంటింగ్ గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

image

నల్గొండ పట్టణ సమీపంలోని
అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న గోదాములో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుకై ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చందన ఆదివారం తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపు కు ఏర్పాటు చేసే టేబుళ్లు,బ్యారీకేడింగ్, ఏజెంట్లు బ్యారేడింగ్, భద్రత, తదితరాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు రెండు రోజుల ముందు అధికారులకు ఇక్కడ బస ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Similar News

News December 16, 2025

పేరుకే కొలువు.. వేతనాలు అందక 9 నెలలు!

image

నెలల తరబడి వేతనాలందక జిల్లాలోని ‘104’ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణకు కొందరు అప్పులు చేస్తున్నారు. ఇంకొందరి పరిస్థితి దయనీయంగా మారింది. 9 నెలలుగా వేతనాలు సక్రమంగా అందకపోవడంతో అప్పులు చేసి కాలం వెళ్లదీస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 100కు పైగానే 104 సిబ్బంది పని చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.

News December 16, 2025

NLG: 38 మందిపై కేసు.. ఆ గ్రామంలో పోలీస్ పికెట్

image

నిడమనూరు(M) సోమోరిగూడెంలో జరిగిన ఉద్రిక్తతకు కారకులైన 38మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సతీష్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆదివారం రాత్రి BRS నాయకులు, పోలింగ్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు సోమోరిగూడెం వచ్చి ఘర్షణకు పాల్పడిన వారిని చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో BRS వర్గీయులు ఎన్నికల సామాగ్రి పోస్టర్లు చించివేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

News December 16, 2025

వైష్ణవ ఆలయాల్లో నేటి నుంచి ధనుర్మాసం

image

జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు ధనుర్మాస ఉత్సవాలకు సిద్ధమయ్యాయి. నేటి నుంచి జనవరి 14 వరకు వేంకటేశ్వరస్వామి, శ్రీరామ మందిరాల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మాసంలో రోజూ తెల్లవారుజామున తులసి మాల కైంకర్యం, గోదాదేవి రచించిన పాశురాల పఠనం నిర్వహిస్తారు. సాయంత్రం వేళల్లో పుష్పాలంకరణలు, పల్లకీ సేవలు నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.