News February 9, 2025

కౌటాలలో పదో తరగతి విద్యార్థిని సూసైడ్

image

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కౌటాలలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ వివరాల ప్రకారం.. మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హనీస్ఫూర్తి స్టడీ మెటీరియల్ కోసం మొబైల్ ఫోన్ అడగ్గా తల్లి నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News February 18, 2026

తిన్న తర్వాత 10 నిమిషాల నడకతో షుగర్ వ్యాధికి ఫుల్ స్టాప్!

image

భోజనం తర్వాత 10 ని.లు నడిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని లైఫ్‌స్టైల్ కోచ్‌లు అంటున్నారు. ఈ చిన్న అలవాటు రక్తంలో షుగర్ లెవెల్స్ సడన్‌గా పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇన్సులిన్ రెస్పాన్స్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఎక్కడైనా చేయగలిగే ఈ 10 నిమిషాల నడక దీర్ఘకాలంలో టైప్-2 డయాబెటిస్ ముప్పును తప్పిస్తుంది.

News February 18, 2026

జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవే ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. ధంసలాపురం ఎంట్రీ, ఎగ్జిట్‌కు 1.38 ఎకరాల భూసేకరణ త్వరగా పూర్తి చేసి మార్చి 15లోపు పనులు ముగించాలని ఆదేశించారు. నాగపూర్- అమరావతి హైవే ప్యాకేజీలకు కొనిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో భూ స్వాధీనం వేగవంతం చేయాలన్నారు. 17 జంక్షన్ల రోడ్డు భద్రతా పనులు నెలాఖరుకు పూర్తి చేయాలని సూచించారు.

News February 18, 2026

పెద్దపల్లి: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

image

NHM జేఏసీ పిలుపుతో “ప్రజాప్రతినిధుల ములాఖాత్” కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావును జేఏసీ ఉద్యోగులు కలిసి వినతి పత్రం అందజేశారు. రెగ్యులరైజేషన్‌తో పాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలో కూడా రెగ్యులరైజేషన్ చేపట్టేలా ప్రభుత్వానికి సూచించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మహేందర్, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.