News January 15, 2025
కౌటాల: కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి

కౌటాల మండలం జనగామ గ్రామ పల్లె ప్రకృతి వనం సమీపంలో కోడిపందేల స్థావరంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఎస్పీ దేవి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సీఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో దాడి చేసినట్లు ఎస్ఐ మధుకర్ తెలిపారు. 9 మందిని అదుపులోకి తీసుకొని, 3 కోడిపుంజులు, నగదు రూ.3900, 3 కోడి కత్తులు స్వాధీన చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 18, 2025
ADB: కత్తిపోట్ల ఘటన.. UPDATE

తలమడుగు మండలం రుయ్యాడిలో ఓ వ్యక్తి <<15500882>>దారుణ హత్య<<>>కు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో బావబామ్మర్దుల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో బావ మహేందర్‌పై బామ్మర్ది అశోక్ కత్తితో దాడి చేశాడు. దీంతో మహేందర్ అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రిమ్స్‌కు తరలించారు.
News February 18, 2025
రుయ్యాడిలో కత్తిపోట్ల కలకలం.. ఒకరి మృతి

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఓ వ్యక్తి మంగళవారం కత్తిపోటుకు గురయ్యారు. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గొడవలో మహేందర్ అనే వ్యక్తిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.
News February 18, 2025
నిర్మల్: 3 ప్రమాదాలు.. ఐదుగురు మృతి

నిర్మల్ జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. కాగా ఓ అనుమానాస్పద మృతి కేసు నమోదైంది. ఇందులో మూడు ఘటనలు బాసరలో జరగడం గమనార్హం. ఆర్జీయూకేటీ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు చనిపోగా.. అదే ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైంది. పుష్కరఘాట్ల వద్ద మరొకరు నీటమునిగి చనిపోయారు. సారంగాపూర్ మండలంలో జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు దుర్మరణం చెందారు.