News March 13, 2025

కౌటాల: బావిలో యువకుడి మృతదేహం

image

మద్యానికి బానిసై యువకుడు మృతి చెందిన ఘటన కౌటాల మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ వివరాల ప్రకారం.. మండలంలోని మొగడ్‌ధగడ్‌కు చెందిన ఉర్వత్ దౌలత్ (26) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం మద్యం మత్తులో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం గ్రామ సమీపంలోని బావిలో అతడి మృతదేహం లభించింది. తల్లి నిర్మల భాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 13, 2026

ఆ పథకాన్ని ఏపీలోనూ అమలు చేయాలి: చిత్తూరు MP

image

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని ఏపీలో అమలు చేయాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కోరారు. ప్రస్తుతం చంఢీగఢ్, అస్సాం, పంజాబ్, ఉత్తరఖండ్, హర్యానా, పుదుచ్చేరిలో అమలులో ఉన్న ఈ పథకాన్ని ఏపీలోనూ అమలు చేసి బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. దీనికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించినట్టు ఆయన పేర్కొన్నారు.

News February 13, 2026

MBNR: 41 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు!

image

మహబూబ్ నగర్ జిల్లాలోని 81 డివిజన్ల మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు అధికారులు 41 టేబుళ్లను సిద్ధం చేశారు. ఇందులో మహబూబ్ నగర్ కార్పొరేషన్ కోసం 30, దేవరకద్రకు 6, భూత్పూర్ మున్సిపాలిటీకి 5 టేబుళ్లను కేటాయించారు. మొత్తం 185 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది.

News February 13, 2026

HYDలో ఎయిర్ క్వాలిటీ @194

image

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ శుక్రవారం తెల్లవారుజామున టీచర్స్ కాలనీలో 194గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.