News December 1, 2025

కౌన్సిల్ సమావేశంలో అందెశ్రీకి నివాళి

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాలులో నిర్వహించిన సమావేశంలో ప్రముఖ కవి, రచయిత అందెశ్రీకి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేలు, మేయర్, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ సాహిత్యానికి ఆయన మరణం తీరని లోటు అని నేతలు పేర్కొన్నారు.

Similar News

News February 10, 2026

విధుల్లో అలసత్వం వహిస్తే వేటు: నిర్మల్ ఎస్పీ

image

మున్సిపల్ ఎన్నికల విధుల్లో పోలీసు సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. సిబ్బందికి మంగళవారం దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎవరి ప్రలోభాలకు, రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని స్పష్టం చేశారు. సమస్యాత్మక కేంద్రాలపై కన్నేసి ఉంచాలని, చిన్న గొడవ జరిగినా వెంటనే స్పందించి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు ముగిసేలా చూడాలని ఆదేశించారు.

News February 10, 2026

1000 మందితో పహారా: నిర్మల్ ఎస్పీ

image

మున్సిపల్ ఎన్నికలకు 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లోని 80 వార్డులకు గాను 244 పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రత కల్పించామన్నారు. 48 సమస్యాత్మక, 37 అతి సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, 144 సెక్షన్ అమల్లో ఉందని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, పెట్రోలింగ్‌తో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు.

News February 10, 2026

డిజిటల్ లావాదేవీల పై అప్రమత్తత అవసరం: కలెక్టర్

image

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన పొందాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. RBI ఫిబ్రవరి 9 నుంచి 13వ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు పాటించడం, డిజిటల్ లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు.