News November 7, 2025
క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలి: జేసీ

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ద్వారా క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశం ఉందని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ భావన అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా శుక్రవారం చెరుకుపల్లి మండలం కావూరులోని ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చిన్ననాటి నుంచి క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో విజయలక్ష్మీ పాల్గొన్నారు.
Similar News
News January 16, 2026
PCOSకి చెక్ పెట్టే చియా సీడ్స్

ప్రస్తుతకాలంలో చాలామందిని బాధించే సమస్య PCOS. దీనివల్ల బరువు పెరగడం, పీరియడ్స్ సరిగా రాకపోవడంలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే PCOSకి చియాసీడ్స్ పరిష్కారం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటిలో పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను నెమ్మది చేసి, చక్కెర శోషణను తగ్గిస్తాయి. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. బరువును తగ్గిస్తుంది.
News January 16, 2026
KNR: మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్ జిల్లా మైనారిటీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల పోస్టర్‌ను అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆవిష్కరించారు. 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు 6, 7, 8 తరగతుల్లోని మిగులు సీట్ల కోసం FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని 9 సంస్థల్లో ఉత్తమ బోధనతో పాటు IIT/NEET శిక్షణ ఇస్తారన్నారు.పూర్తి వివరాలకు www.tgmreistelangan.cgg.gov.in సంప్రదించాలన్నారు
News January 16, 2026
MBNR:CM పర్యటన..ట్రాఫిక్ మళ్లింపు2/2

1.జడ్చర్ల నుంచి రాయచూర్ వెళ్లే వాహనాలు
→SVS హాస్పిటల్ ముందు నుండి, RTC బస్టాండ్, వన్ టౌన్ చౌరస్తా మీదుగా రాయచూర్ రోడ్డు చేరుకోవచ్చు.
2.నాగర్‌కర్నూల్ నుంచి MBNR టౌన్‌లోకి వచ్చే వాహనాలు
→భూత్పూర్ ఫ్లైఓవర్ క్రింది భాగంలో లెఫ్ట్ తీసుకొని, తాటికొండ మీదుగా మహబూబ్‌నగర్ టౌన్‌లోకి రావచ్చు.
3.కర్నూల్ నుంచి మహబూబ్‌నగర్ వచ్చే వాహనాలు
→NH-44 నందు తాటికొండ మీదుగా మహబూబ్‌నగర్ టౌన్‌లోకి ప్రవేశించవచ్చు.


