News November 20, 2025

క్రమశిక్షణకు మారు పేరు చుక్కారామయ్య: హరీశ్ రావు

image

నిరాడంబరత్వానికి నిలువుటద్దం, క్రమశిక్షణకు మారుపేరు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ‘X’ లో పేర్కొన్నారు. ఐఐటీ రామయ్యగా సుపరిచితులైన చుక్కా రామయ్య 100 ఏటా అడుగు పెట్టిన సందర్భంగా ఆయనతో కలిసి ఉన్న ఫొటోను హరీశ్ రావు పోస్ట్ చేశారు.అక్షరం ఆయన ఆయుధం ఉన్నారు. వందేళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన చుక్క రామయ్య మరింత ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

Similar News

News January 20, 2026

ఎల్బీనగర్ మెట్రోలో GOOD ‘మెసేజ్’

image

ఎప్పుడూ బిజీగా ఉండే మెట్రోలో మంగళవారం ఓ వింత దృశ్యం కనిపించింది. ఎల్బీనగర్ వెళ్లే రైలులో ఎవరో ఒక ‘జెన్-జీ’ కుర్రాడో, అమ్మాయో అతికించిన గ్రీన్ స్టిక్కీ నోట్స్ ప్రయాణికుల మనసు గెలుచుకుంటున్నాయి. “ప్రతిఫలం ఆశించకుండా సాయం చెయ్.. నీ మనసు చెప్పిందే విను” అంటూ డయానా చెప్పిన మంచి మాటలను ఆ నోట్స్‌పై రాశారు. యాంత్రికమైన ఈ కాలంలో నలుగురికి మంచిని పంచాలనే ఈ చిన్న ప్రయత్నం ప్రయాణికుల్లో నవ్వులు పూయించింది.

‘జారుతున్న బతుకులు’.. గౌడన్నల గోసపై ప్రత్యేక కథనం

image

తిర్యాణి మండలంలో సుమారు 500 గౌడ కుటుంబాలు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. మండలంలో కొన్ని ప్రాంతాలు ఏజెన్సీలో ఉండడంతో ఇక్కడ జీవిస్తున్న గీత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదు. ఎత్తయిన తాడి చెట్ల నుంచి జారుతూ పిట్టలా రాలిపోతున్నా తమను పట్టించుకునే వారే లేరని గౌడ కుటుంబాలు వాపోతున్నాయి. ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గౌడ కులస్థులను ఆదుకోవాలని గీత కార్మికులు కోరుతున్నారు.