News December 2, 2025
క్రికెట్‌లో సంగారెడ్డి జట్టు విజయం

బేపీఆర్ సింగపూర్ మైదానంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్ జిల్లాల క్రికెట్ అండర్ 14 పోటీలు నిర్వహించారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సిద్దిపేట పింక్ జట్టు 89 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సంగారెడ్డి ఏ జట్టు 90 పరుగులు చేసి విజయం సాధించిందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు.
Similar News
News February 13, 2026
పెద్దపల్లి జిల్లాలో పార్టీల వారీగా విజేతల వివరాలు..!

పెద్దపల్లి జిల్లాలో 124 వార్డు స్థానాలు ఉండగా రామగుండం కార్పొరేషన్ లో ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. మిగతా 123 వార్డులకు జరిగిన ఎన్నికలలో పార్టీల వారీగా బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ – 89, BRS – 16, BJP- 3, AIFB- 13, CPI- 1, స్వతంత్ర అభ్యర్థులు- 2 స్థానాలలో విజయం సాధించారు.
News February 13, 2026
మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ ముందంజ

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 60 స్థానాలకు గాను 30 డివిజన్లకు లెక్కింపు పూర్తయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో, బీఆర్ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎంఐఎం 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతుంది.
News February 13, 2026
మెట్‌పల్లి: మూడవ రౌండ్‌లో విజయం సాధించిన అభ్యర్థులు వీరే

మెట్‌పల్లి మున్సిపాలిటీ వార్డుల్లో 3వ రౌండ్ విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు ఇవే. 3వ వార్డు బత్తుల నరేశ్ కాంగ్రెస్, 6వ వార్డు బంగారుకాళ్ల నీరజ బీఆర్ఎస్, 9వ వార్డు బొడ్ల వసుధ బీజేపీ, 12వ వార్డు సుమయ్య తబస్సుం ఇండిపెండెంట్, 15వ వార్డు అరిగేలా అనూష బీజేపీ, 18వ వార్డు చెట్లపెల్లి మీనా, 21వ వార్డు ఖాజా అజీమ్ వొద్దిన్ ఇండిపెండెంట్ 24వ పూదరి జ్యోతి బీఆర్ఎస్ విజయం సాధించారు.


