News August 11, 2025

క్రీడాకారిణి అక్షయకు MLA అభినందనలు

image

పలమనేరుకు చెందిన రగ్బీ క్రీడాకారిణి అక్షయకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అభినందనలు తెలిపారు. బీహార్ వేదికగా ఈ నెల 9, 10 తేదీలలో జరిగిన ఏషియా రగ్బీ ఎమిరేట్స్ అండర్-20 ఛాంపియన్‌షిప్‌లో శ్రీనగర్ కాలనీకి చెందిన సురేష్, శ్రీదేవిల కుమార్తె అక్షయ భారత జట్టు తరఫున ఆడి కాంస్య పతకం సాధించింది. ఇది ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News March 12, 2026

ఎక్కువ రేట్లకు సిలిండర్లు అమ్ముతున్నారా.. కాల్ చేయండి.!

image

గ్యాస్ సిలిండర్లపై అసత్య వార్తలు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సిలిండర్ల కొరత, ధరలు పెరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే 112 సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని విశ్వసించాలన్నారు.

News March 12, 2026

కడపల్లి KSS సారథిగా CM చంద్రబాబు

image

శాంతిపురం(M) కడపల్లి కుటుంబ సాధికార సారథిగా CM చంద్రబాబు తన పేరు నమోదు చేసుకున్నారు. CM చంద్రబాబు నివాసం కడపల్లి పంచాయతీ శివపురం వద్ద ఉండడంతో ఆ పంచాయతీ పార్టీ ప్రతినిధిగా నిర్దిష్ట బాధ్యతలను నిర్వర్తించనున్నారు. తిమ్మరాజు పల్లి బూత్ నంబర్ 49లో ఓటరు క్రమసంఖ్య 181 నుంచి 240 వరకు 60 మంది ఓటర్లను కలవనున్నారు. గత ఏడు జులై 2న CM చంద్రబాబు తిమ్మరాజు పల్లిలో పర్యటించారు.

News March 12, 2026

‘గ్యాస్ సరఫరా’పై చిత్తూరు SP సీరియస్ వార్నింగ్

image

చిత్తూరు జిల్లాలో గ్యాస్ సరఫరాపై అసత్య కథనాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని SP తుషార్ డూడీ హెచ్చరించారు. ‘యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ సిలిండర్ కొరత, ధరలు భారీగా పెరిగాయి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు’ లాంటి సమాచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మొద్దన్నారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.