News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 9, 2026
మేడ్చల్ జిల్లాలో రైతుల రిజిస్ట్రేషన్ 89% పూర్తి

మేడ్చల్ జిల్లాలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొంత గందరగోళంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM కిసాన్ రైతు రిజిస్ట్రేషన్‌ను అనుసంధానం చేయడంతో అగ్రికల్చర్ విస్తరణ అధికారులకు ఇది తలనొప్పిగా మారింది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం అందనుంది. జిల్లాలో మొత్తం 19,589 మంది రైతులు ఉండగా ఇప్పటి వరకు సుమారు 89 శాతం మాత్రమే పూర్తైంది.
News March 9, 2026
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ‘మక్క’ సాగు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు రికార్డు స్థాయికి చేరింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1.69 లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 72 వేల ఎకరాల్లో పంట సాగైంది. మార్కెట్‌లో క్వింటాల్ ధర రూ.1800 లోపే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే రూ.2400 మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, అకాల వర్షాల నుండి అన్నదాతలను ఆదుకోవాలని కోరుతున్నారు.
News March 9, 2026
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,61,680కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 పతనమై రూ.1,48,200 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.


