News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 7, 2026

హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్

image

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. 30వేల చ.అడుగుల ఈ ఆఫీస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఈ నెల 12న ప్రారంభించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు ఇప్పటికే ముంబైలో కార్యాలయం ఉండగా భారత్‌లో ఇది రెండోది కానుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాకతో HYDలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ సెక్టార్లు బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

News March 7, 2026

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

image

TPCC మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామకమయ్యారు. ఆమె నియామకాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆమె కాంగ్రెస్‌లో 45 ఏళ్లుగా ఉన్నారు. 1991లో PACS ఛైర్‌పర్సన్‌గా తొలిసారి ఎన్నికవగా 2005లో వరంగల్ నగర మేయర్‌గా పని చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి MLAగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023-2025 వరకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు.

News March 7, 2026

గుంటూరు: మిర్చి యార్డుకు సరకు రాకల్లో హెచ్చుతగ్గులు

image

గుంటూరు మిర్చి యార్డుకు వచ్చే టిక్కీల సంఖ్యలో మార్పులు కనిపిస్తున్నాయి. రెండు రోజులు లక్షా 25 వేల వరకు టిక్కీలు వచ్చినా శుక్రవారం సుమారు 88 వేలకే పరిమితమయ్యాయి. ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఈ తగ్గుదలకు స్పష్టమైన కారణం లేదు. హోలీ కారణంగా ఈ వారంలో నాలుగు రోజులు మాత్రమే లావాదేవీలు జరిగాయి. సోమవారం 1,04,740 టిక్కీలు రాగా తరువాత రోజుల్లో సంఖ్య పెరిగింది. ప్రస్తుతం యార్డులో 26 వేల మిర్చి బస్తాలు ఉన్నాయి.