News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 11, 2026
కామారెడ్డి: పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే..

కామారెడ్డి జిల్లాలో 65 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాల్లో 739 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు అదనంగా అదనపు డిపార్ట్‌మెంట్ అధికారులు ఏడుగురిని నియమించారు. 13,154 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
News March 11, 2026
NLC ఇండియా లిమిటెడ్‌లో 16 పోస్టులు

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(NLC) ఇండియా లిమిటెడ్ 16 హెల్త్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హులకు ఇంటర్/డిప్లోమా(శానిటరీ ఇన్‌స్పెక్టర్)/బ్యాచిలర్ డిగ్రీ/పీజీ డిప్లోమాతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలని పేర్కొంది. వయసు 30 ఏళ్లు దాటకూడదు. వేతనం రూ.38 వేలు. రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు 02-04-2026 చివరి తేదీ. మరిన్ని వివరాలకు www.nlcindia.in చూడండి.
News March 11, 2026
WGL: ఆస్పత్రుల లైసెన్స్ రెన్యువల్ ఆలస్యం..!

WGL నగరంతో పాటు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్ల లైసెన్స్ రెన్యువల్ అంశం వివాదంగా మారింది. జిల్లాలో సుమారు 170 ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉండగా వాటిలో 40కిపైగా లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు DMHO కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ ప్రకారం కలెక్టర్ అనుమతి అవసరం కావడంతో ప్రక్రియ ఆలస్యం అవుతోందని, తద్వారా CMRF, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావట్లేదు.


