News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 9, 2026
సంగారెడ్డి: అక్టోబర్‌లో 101 ఏళ్ల బర్త్ డే.. మృతి

సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన శతాధిక వృద్ధురాలు గాదె పారమ్మ (101) ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత ఏడాది అక్టోబర్‌లో ఆమె కుమారులు, మనమలు, ముని మనమలు కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సుదీర్ఘ జీవిత ప్రయాణాన్ని ముగించి ఆమె మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కంగ్టి సర్పంచ్ కృష్ణ, ముదిరాజ్ సంఘం నాయకులు ఆమె మృతికి సంతాపం తెలిపారు.
News March 9, 2026
కరీంనగర్: ఈనెల 12 వరకే ఛాన్స్..!

క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అద్భుత అవకాశం కల్పించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కరీంనగర్ పాఠశాలలో మొత్తం 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఈనెల 12వ వరకు మాత్రమే గడువు ఉందని అధికారులు తెలిపారు. 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన వారు ఈ ప్రవేశాలకు అర్హులు.
News March 9, 2026
మెట్రో-ఫ్లైఓవర్లతో విశాఖ ట్రాఫిక్‌కు పరిష్కారం

విశాఖలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు మెట్రో రైలు ప్రాజెక్టు కీలకం కానుందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్. రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ వివరాలను సీఐఐ విజయవాడ వార్షిక సమావేశంలో వెల్లడించారు. 76.70 కి.మీ. పొడవున 4 కారిడార్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఎన్‌హెచ్-16 వెంట మెట్రో-కమ్ నాలుగు లేన్ ఫ్లైఓవర్ ప్రతిపాదించామన్నారు. మొత్తం 12 ఫ్లైఓవర్లు నిర్మించాలని ఎన్‌హెచ్ఏఐ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు.


