News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 17, 2026
ఏపీని డ్రగ్స్ అడ్డాగా మార్చారు: వైసీపీ

కూటమి ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ అడ్డాగా మార్చిందని వైసీపీ విమర్శించింది. నాడు వంద రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పి.. నేడు రాష్ట్రం మొత్తం గంజాయి అమ్మకాలు జోరుగా సాగిస్తోందని ధ్వజమెత్తింది. ప్రస్తుతం టీడీపీ నాయకులు, వారి కొడుకులు డ్రగ్స్ వ్యాపారంలో మునిగితేలుతున్నారని, ఏకంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్‌తో దొరికిపోవడంతో టీడీపీ నాయకులు సిగ్గుతో కుమిలిపోతున్నారని పేర్కొంది.
News March 17, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,600
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,352
* వెండి 10 గ్రాముల ధర రూ.2,610.
News March 17, 2026
బాపట్ల రైతులకు JC సూచనలు

రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన మంగళవారం పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1,73,384.540 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈనెల 28తో మూసివేస్తారన్నారు. రైతులు తమ ధాన్యాన్ని 28 లోపు విక్రయించుకోవాలన్నారు.


