News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

పాకిస్థాన్‌కు ‘రావి’ షాక్: ఏప్రిల్ నుంచి నీళ్లు బంద్!

image

వేసవి వేళ పాక్‌కు భారత్ షాకివ్వనుంది. రావి నదిపై నిర్మిస్తున్న షాపూర్ కండి బ్యారేజ్ మార్చి 31 నాటికి పూర్తి కానుంది. దీంతో ఏప్రిల్ నుంచి పాక్‌కు వెళ్లే మిగులు జలాలను పూర్తిగా నిలిపేయనున్నట్లు JK మంత్రి జావెద్ అహ్మద్ ప్రకటించారు. 1960 ఒప్పందం ప్రకారం ఈ నదిపై భారత్‌కే పూర్తి హక్కులు ఉన్నా ఇన్నాళ్లూ ప్రాజెక్టుల్లేక నీరు వృథాగా పాక్‌కు వెళ్లేది. ఇకపై ఆ నీటితో JK, పంజాబ్‌లకు సాగునీరు అందనుంది.

News February 17, 2026

సంగారెడ్డి: ఈనెల 21న పాఠశాలల్లో పీటీఎం సమావేశం

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 21న తప్పనిసరిగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని డిఇఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం, పాఠశాలల అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించాలని సూచించారు. చర్చించిన అంశాలను వెంటనే మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు.

News February 17, 2026

ఏడుపాయల జాతర.. సేపట్లో రథోత్సవం

image

ఏడుపాయల వనదుర్గా భవాని మాత జాతర ముగింపు దశకు చేరుకుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన రథోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. గర్భగుడిలో ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో రథం వద్దకు చేర్చారు. ఆనవాయితీ ప్రకారం నాగసాన్‌పల్లి వతందారులు ఈ ప్రక్రియను నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో రథోత్సవం ప్రారంభం కానుంది.