News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 19, 2026

చిన్న వయసులోనే తల నెరుస్తోందా?

image

చర్మంలో మెలనిన్‌ ఉత్పత్తి తగ్గినప్పుడు తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. ఇది వృద్ధాప్యచిహ్నం. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే తల నెరుస్తోంది. హార్మోనుల్లో అసమతుల్యత, అనారోగ్యకర జీవన శైలి, కాలుష్యం, రసాయనాలున్న, సింథటిక్‌ షాంపూలు వాడటం దీనికి కారణం అంటున్నారు నిపుణులు. గోధుమ, పెరుగు, టొమాటో, అరటి, చిరుధాన్యాలు, గుడ్డు, చేప, సీఫుడ్‌, సోయాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

News February 19, 2026

TG EAPCET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

image

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే EAPCET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 4 వరకు <>https://eapcet.tgche.ac.in/<<>>లో అప్లై చేసుకోవచ్చు. లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకునేందుకు మే 2 వరకు అవకాశం ఉంది. ఈసారి కొత్తగా మొబైల్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. కాగా మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్&ఫార్మసీ పరీక్షలు, మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.

News February 19, 2026

వేములవాడ రాజన్న ఆలయ పనులకు వినియోగిస్తున్న వాహనం సీజ్

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు వినియోగిస్తున్న టిప్పర్‌ను మోటార్ వాహన తనిఖీ అధికారులు సీజ్ చేశారు. ట్యాక్స్ కట్టకుండా వినియోగిస్తున్న వాహనాన్ని గుర్తించిన ఎంవీఐ వంశీధర్, ఏఎంవీఐలు రజనీ దేవి, పృథ్వీరాజ్ వర్మ టిప్పర్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓవర్ లోడ్ లేదా ట్యాక్స్ చెల్లించని 10 వాహనాలను గురువారం సీజ్ చేసినట్లు వారు తెలిపారు.