News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
రేపు పాఠశాలలు యథావిధి.. సెలవు రద్దు!

రెండో శనివారం అనగా రేపు పాఠశాలలకు సెలవు ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. సాధారణంగా రెండో శనివారం సెలవు ఉంటుందని భావించి ఉపాధ్యాయులు ముందే సెలవు ప్రకటించగా, విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలతో జిల్లా అధికారులు ఆ నిర్ణయాన్ని మార్చారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యథావిధిగా నడవాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం చేరవేస్తూ పాఠశాలకు రావాలని కోరుతున్నారు.
News February 13, 2026
బర్డ్ ఫ్లూ భయం.. పడిపోయిన చికెన్ ధరలు

AP: ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో <<19090331>>బర్డ్ ఫ్లూ బయటపడటంతో<<>> చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 10 రోజుల కిందటి వరకు కేజీ చికెన్ రూ.300పైనే ఉండగా ప్రస్తుతం రూ.160-180కి తగ్గింది. కాగా బర్డ్‌ఫ్లూ ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేదని అధికారులు చెబుతున్నారు. చికెన్, కోడి గుడ్లను 100 డిగ్రీలపైన వేడితో ఉడికించి తింటే ప్రమాదం లేదంటున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 13, 2026
RGM: వన్ CI, గన్ మెన్ పై చర్యలు తీసుకోవాలని వినతి

ఈనెల 10న గోదావరిఖనికి చెందిన మార్కాపురి తిలక్ న్యాయవాదిపై వన్ టౌన్ CI ఇంద్రసేనారెడ్డి అనుచిత ప్రవర్తన, దాడి చేసిన గన్ మెన్ పై చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను బార్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయంలో CIపై చర్యలు తీసుకోవాలని CPని కోరారు. చర్యలు తీసుకునే వరకు విధులకు హాజరుకామని లాయర్లు పిలుపునిచ్చారు.


