News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 9, 2026

KMR: పుర పోరుతో దొరికిన ఉపాధి

image

కామారెడ్డి జిల్లాలో ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల పర్వం పలువురు వ్యక్తులకు ఉపాధిని కల్పించింది. పోటాపోటీగా కార్యకర్తలను సమకూర్చేందుకు ఒక్కొక్కరికి రూ.200 నుంచి 400వరకు, భోజనం ఫ్రీ, ప్రచార కరపత్రాల, ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ లకు, ప్రచార వాహనాల యజమానులకు, టిఫిన్ సెంటర్ లు, వంటలవారికి, పాటల మిక్సింగ్, మ్యూజిక్, టెంట్ హౌస్ ఇలా ప్రతి ఒక్కరికి నామినేషన్ల నుంచి పోలింగ్ పూర్తయ్యేవరకు ఉపాధి లభించింది.

News February 9, 2026

NTR: జగన్‌ ఫ్లెక్సీకి రక్త తిలకం.. కేసు నమోదు

image

మాజీ సీఎం జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన నేపథ్యంలో మైలవరానికి చెందిన అఖిల్ అనే యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. రింగ్ సెంటర్‌లోని జగన్ ఫ్లెక్సీకి బ్లేడుతో చేయి కోసుకుని రక్త తిలకం దిద్దాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బహిరంగంగా అలజడి సృష్టించినందుకు ఇబ్రహీంపట్నం పోలీసులు అఖిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 9, 2026

కిరాణాషాపులకు దెబ్బ?

image

ఇప్పటివరకు మెట్రో సిటీలకే పరిమితమైన క్విక్ కామర్స్ రంగం టైర్ 3/4 నగరాలకు వచ్చేసింది. ఇండియాలోని 200 నగరాల్లో బ్లింకిట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాబోయే ఐదేళ్లలో భారీగా కిరాణా దుకాణాలు మూతపడే అవకాశం ఉందని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే 10 ని. డెలివరీ ప్రభావం కిరాణాషాపులపై అంతగా ఉండదని, మెట్రో సిటీల్లో ఇది చూశామని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ COMMENT?