News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

జగిత్యాల: ‘ఉపాధి కల్పన కార్డుకు నమోదు చేసుకోవాలి’

image

విద్యార్థులు ఉపాధి కల్పన కార్డుకు నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ పేర్కొన్నారు. జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్, ఉపాధి కల్పన కార్డు నమోదు కార్యక్రమంపై బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. సిబ్బంది లైన కుమారి, ప్రసన్న, సదానందం లు రిజిస్ట్రేషన్ ప్రక్రియను విద్యార్థులకు చూపించారు.

News February 18, 2026

ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి తీసుకోండి: CBN

image

AP: GOVT ఆమోదించిన ప్రాజెక్టులు త్వరగా ఏర్పాటవ్వాలని సీఎం CBN SIPB భేటీలో అధికారులను ఆదేశించారు. ‘గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, BPCL వంటి మెగా ప్రాజెక్టులు ఏర్పాటు కావాలి. భూముల కేటాయింపులపైన ఇతరులతో మాట్లాడాలి. ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే ఆ భూముల్ని తీసుకోండి. సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలిస్తాం’ అని చెప్పారు. కాగా ₹29,021 కోట్లతో 22,407 ఉద్యోగాలిచ్చే 27 ప్రాజెక్టులను ఆమోదించారు.

News February 18, 2026

మక్తల్‌కు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ఆతిథ్యం

image

మక్తల్ పట్టణంలో ఈనెల 20 నుంచి 23 వరకు నాలుగు రోజులపాటు సీఎం కప్‌లో భాగంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ వాకిటి మానస హనుమంతు తెలిపారు. బుధవారం మక్తల్ మినీ స్టేడియంలో ఏర్పాట్లను క్రీడాశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి నేతృత్వంలో పరిశీలించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం 66 జట్లు, 1500 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.