News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
గద్వాల జేజమ్మకు షాక్: బలం చూపని బీజేపీ

TG: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో BJP పెద్దగా ప్రభావం చూపించలేదు. MP డీకే అరుణకు మున్సిపల్ ఫలితాలు షాక్ ఇచ్చాయి. తన సొంత అసెంబ్లీ సెగ్మెంట్ గద్వాలలో పోటీ ఇవ్వలేకపోయారు. అక్కడ 32 వార్డుల్లో కేవలం 6 చోట్ల మాత్రమే BJP గెలిచింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా మహబూబ్‌నగర్లో ప్రచారం చేశారు. అయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో కాషాయ జెండా ఎగరలేదు. ఈ ఫలితాలు డీకే అరుణకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
News February 13, 2026
ఇస్నాపూర్‌లో ఇండిపెండెంట్‌లే కీలకం..!

ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఇండిపెండెట్లు కీలకంగా మారారు. 26 వార్డుల్లో BRS-12, కాంగ్రెస్-10 వార్డులు కైవసం చేసుకోగా.. మరో నాలుగు స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. అయితే వీరిలో ఇద్దరు అభ్యర్థులు బీఆర్ఎస్ రెబల్స్ ఉన్నారు. మరో ఇద్దరు స్వతంత్రులుగా బరిలో దిగారు. మరి వీరు బీఆర్ఎస్‌కు మద్దతిస్తారా.. లేక అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారా అన్నది 16న తేలనుంది.
News February 13, 2026
GNT: అధ్యాపకుల గైర్హాజరు.. నోటీసులకు కలెక్టర్ ఆదేశాలు

చేబ్రోలు డిగ్రీ కళాశాలను కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల పరిసరాలు పరిశుభ్రత అధ్వానంగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యాపకుల హాజరు పట్టిక పరిశీలించిన కలెక్టర్ పలువురు గైర్హాజరు పట్ల ప్రశ్నించారు. మూమెంట్ రిజిస్టర్ పరిశీలించి అందులో ఎటువంటి అనుమతులు నమోదు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హారైన అధ్యాపకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు.


