News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 18, 2026
మధిర: ఇద్దరు హెచ్‌ఎంలపై వేటు

మధిరలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. గర్ల్స్ హైస్కూల్ HM హైమావతిని వరంగల్ ఆర్జేడీకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కలెక్టర్ తనిఖీలో లోపాలు గుర్తించినట్లు సమాచారం. అలాగే ఎంపీపీఎస్ గర్ల్స్ స్కూల్ HM కెబిఎస్ రాజును వేంసూర్‌కు బదిలీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వల్లే ఈ చర్యలని డీఈవో జైని తెలిపారు.
News February 18, 2026
చిత్తూరు: స్నేక్ రెస్క్యూపై ప్రత్యేక చర్యలు.!

పాముల సంరక్షణపై అటవీశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘సర్పమిత్ర’ కార్యక్రమంలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి HWC హాట్‌స్పాట్స్‌లో పాములను కాపాడే విధంగా ప్రణాళిక రూపొందించింది. టీమ్‌లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్పమిత్ర ట్రైనర్లుగా నియమించనున్నారు. నిపుణులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్నేక్ రెస్క్యూ సర్టిఫికేషన్ కోర్సు ప్రారంభించి, పాముల పట్టివేత, సురక్షిత హ్యాండ్లింగ్‌పై ప్రొటోకాల్ రూపొందించనున్నారు.
News February 18, 2026
కూరగాయలు తాజాగా ఉండాలంటే?

కూరగాయలు తాజాగా ఉండటానికి జపనీయులు కాటన్, మస్లిన్ వస్త్రంలో చుట్టేస్తారు. ఆకుకూరలను కాస్త తడిపిన క్లాత్‌లో చుట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచుతారు. అలాగే ఫ్రిడ్జ్‌లో కూరగాయలు పెట్టాలి అనుకున్నప్పుడు వాటిని శుభ్రంగా కడిగి, తుడిచి పొడిగా ఉన్నప్పుడే పెట్టాలి. పండిపోయినవి త్వరగా వాడేయాలి. లేదంటే వాటి ప్రభావం వేరే కూరగాయలపై పడుతుంది. అలాగే టైట్ కవర్‌లో కూరగాయలు పెట్టడం వల్ల తర్వరగా పాడైపోతాయి.


