News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 19, 2026
NZB: 58 పరీక్షా కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం NZB జిల్లా వ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 19,299 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,664 మంది మొత్తం 36,963 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ప్రతిరోజూ ఉ. 9 గంటల నుంచి మద్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
News February 19, 2026
ఈ నెల 28న తెలంగాణ బడ్జెట్

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 26న సమావేశాలు ప్రారంభం కానుండగా, 28వ తేదీన అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 15 రోజుల పాటు సభను నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
News February 19, 2026
ఏపీ రాజకీయాలు ఇందాపూర్ డెయిరీ చుట్టూనే..!

కల్తీ నెయ్యి కేసులో సిట్ మూడో ఛార్జిషీట్ దాఖలు చేయడంతో వివాదం సద్దుమణిగిందని అనుకున్నారు. కానీ అక్కడి నుంచి ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రస్తుతం వైసీపీ లేవనెత్తిన ఇందాపూర్ డెయిరీ అంశంపై వాదోపవాదాలు సాగుతున్నాయి. అటు శాసనమండలిలో.. ఇటు టీటీడీ ఛైర్మన్ వర్సెస్ భూమనగా సాగుతుంది. ఇప్పటికే లడ్డూ వివాదంతో విసిగిపోయిన భక్తులు ఒక్కరిపై ఒక్కరు ఆరోపణలు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


