News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 11, 2026

భారత్‌కు అనుకూలంగా ట్రేడ్ డీల్‌లో కండిషన్స్ మార్చిన US

image

భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌లో వైట్ హౌస్ కీలక సవరణలు చేసింది. గతంలో భారత్ $500 బిలియన్ల విలువైన వస్తువులను కచ్చితంగా కొనాలని (Commits) పేర్కొన్న అమెరికా ఇప్పుడు దాన్ని ‘కొనే ఆలోచనలో ఉంది’ (Intends) అన్నట్లుగా మార్చింది. అమెరికా పప్పుధాన్యాలపై భారత్ టారిఫ్ తగ్గిస్తుందన్న పాయింట్‌నూ తొలగించింది. ఇండియా డిజిటల్ ట్యాక్స్‌ తొలగిస్తుందన్న స్థానంలో.. ఈ విషయంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని మార్చింది.

News February 11, 2026

GWL: జిల్లాలో18.42% పోలింగ్ నమోదు

image

గద్వాల జిల్లాలోని అయిజ, వడ్డేపల్లి, అలంపూర్, గద్వాల మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గద్వాల మున్సిపాలిటీలోనీ 37 వార్డుల్లో 9 గంటల వరకు 17.08శాతం పోలింగ్ నమోదైంది. గద్వాల మున్సిపాలిటీలోనీ 37 వార్డుల్లో 9 గంటలకు 17.08, అలంపూర్..18.98, అయిజ 21.17, వడ్డేపల్లి 20.23, మొత్తం 18.42% మధ్యాహ్నం వరకు పోలింగ్ సరళి మరింత పెరిగే అవకాశం ఉంది.

News February 11, 2026

పార్వతీపురం: విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్స్

image

షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాలను అందిస్తోందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం జిల్లాలో అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫోన్ నంబరు, ఆధార్, బ్యాంకు ఖాతా, కులధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు socialjustice.gov.in/schemes వెబ్‌సైట్‌ను సందర్శించండి.