News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 11, 2026
సంగారెడ్డి: ఎన్నికలు జరిగే ప్రదేశాల్లో సెలవు

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో నేడు జరగనున్న ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య స్థానిక సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు కలెక్టర్‌కు ఉన్న అధికారాలను ఉపయోగించి సెలవుదినంగా ప్రకటించినట్లు వివరించారు.
News February 11, 2026
జనగామ జిల్లా యువతికి యూజీసీ నెట్‌లో ఆలిండియా రెండో ర్యాంకు!

రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామానికి చెందిన మాచర్ల రేణుక-వాసు దంపతుల కుమార్తె శిరీష యూజీసీ నెట్‌లో 99.901 పర్సంటేజ్ సాధించి ఆలిండియా రెండో ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా యువతిని కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా గ్రామస్థులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.
News February 11, 2026
తిరుపతిలో విషాదం.. భర్త వేధింపులకు వివాహిత బలి

భర్త వేదింపులను తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలోని ఆటోనగర్‌లో మంగళవారం జరిగింది. కుటుంబీకుల వివరాల మేరకు..ఆటోనగర్‌లో నివసిస్తున్న ఉదయ్, మౌలికకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వెరొక మహిళతో చనువుగా ఉంటూ ఇంటికొచ్చి భార్యను వేదించేవాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నట్లు వారు ఆరోపించారు. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదుతో అలిపిరి ఎస్‌ఐ నరసింహారావు కేసు నమోదు చేశారు.


