News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
జంగారెడ్డిగూడెం: విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

జంగారెడ్డిగూడెం మండలం వెంకటరామానుజపురంలో సోమవారం విద్యుత్ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బాలుడి మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News February 16, 2026
CTR: కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ హెల్త్ మిషన్ (NHM) పథకంలో భాగంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని (DMHO) సుధారాణి పేర్కొన్నారు. డేటా మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మైక్రో బయాలజిస్ట్ .. మొత్తం 5 విభాగాలలో 6 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ చూడాలన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 20.
News February 16, 2026
ఒకే గ్రామంలో 15 రోజుల్లో 12 మంది మృతి

హరియాణాలోని చాయన్సలో 15 రోజుల్లో 12 మరణాలు కలకలం రేపాయి. వీరిలో ఐదుగురు స్కూల్ విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం, వాంతులతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తాగునీరు కలుషితం కావడమే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. 107 ఇళ్లలో వాటర్ శాంపిల్స్ సేకరించగా 23 చోట్ల బాక్టీరియా పెరుగుదల, క్లోరినేషన్ తక్కువగా ఉందని గుర్తించారు.


