News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 10, 2026

మేడారం భక్తులకు కృతజ్ఞతలు తెలిపిన TGSRTC

image

మేడారం జాతరకు నేరుగా వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అమ్మవారి ప్రసాదాన్ని నేరుగా అందిస్తామని అవకాశం కల్పించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల నుంచి 1910 కుటుంబాలు అమ్మవారి ప్రసాదాన్ని ఆర్టీసీ ద్వారా బుకింగ్ చేసుకున్నాయి. ఈ సేవలతో పాటు బస్సుల్లో ప్రయాణించిన వారికి ఆర్టీసీ సంస్థ ఈరోజు సామాజిక మాధ్యమాల ద్వారా భక్తులకు కృతజ్ఞతలు తెలిపింది.

News February 10, 2026

మహాశివరాత్రి సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

image

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ ఆలయాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు SP మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం పార్వతీపురంలోని తన కార్యాలయం నుంచి VC నిర్వహించారు. శివరాత్రిని పురస్కరించుకొని తగిన బందోబస్తు ఏర్పాట్లు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధుల పట్ల తగు సూచనలు, కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు సులభమైన, సురక్షితమైన దర్శనాన్ని కల్పించేలా క్యూ లైన్ల వద్ద బందోబస్త్ పెంచాలన్నారు.

News February 10, 2026

ANU: డీపీఈడీ, ఎంపీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత డిసెంబర్‌లో జరిగిన మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిప్లమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం తెలిపారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఈనెల 19 తేదీలోగా అందించాలని సూచించారు. వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ను సంప్రదించాలన్నారు.