News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
మేడ్చల్‌లో పట్టు నిలుపుకున్న మల్లారెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ MLA మల్లారెడ్డి పట్టు నిలుపుకున్నారు. BJP గెలుపు కోసం MP ఈటల రాజేందర్, కాంగ్రెస్ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేటలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో పురపోరు మరింత రసవత్తరంగా మారింది. నేటి ఫలితాల్లో TGలో మెజార్టీ కాంగ్రెస్ గాలి వీచినా.. మేడ్చల్‌లో జనం కారుకే మొగ్గు చూపారు. 33 వార్డుల్లో మల్లన్న చరిష్మా స్పష్టంగా కనిపించింది.
News February 13, 2026
ఆలేరు మున్సిపల్ పీఠం ‘హస్త’గతం

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆలేరు మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు, బీఆర్ఎస్ 3 స్థానాలు, బిజెపి 2 స్థానాల్లో విజయం సాధించాయి. ఛైర్మన్ రేసులో ఏడవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి భాస్కర్ ఉన్నట్లు సమాచారం.
News February 13, 2026
భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్‌దే

భూపాలపల్లి పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 30 వార్డులకు గాను కాంగ్రెస్ 16 స్థానాలను గెలిచింది. దీంతో మ్యాజిక్ ఫిగర్‌ను దాటిన కాంగ్రెస్, మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమైంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 10 స్థానాలు, సీపీఐ ఒకటి, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట గెలుపొందారు.


