News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
అందోల్: భోజనం పెట్టలేదని కౌంటింగ్ సిబ్బంది నిరసన

అందోల్-జోగిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం లేదని ఎన్నికల సిబ్బంది నిరసన తెలిపారు. ఉదయం నుంచి విధుల్లో ఉన్నామని టిఫిన్ సైతం సరిగా ఇవ్వలేదని.. మధ్యాహ్నం భోజనం పెట్టరా అని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. సిబ్బందికి సరిపడా భోజనం పెట్టలేదని, కర్రీ పాయింట్‌లో ఉడికీఉడకని అన్నం తీసుకొచ్చి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
News February 13, 2026
7 తరాలు మర్చిపోవు.. బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

బాలీవుడ్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టిలకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ‘మా లైన్లోకి రాకపోతే (ఇటీవల రూ.10కోట్లు డిమాండ్ చేశారు) జరిగే పరిణామాలు వచ్చే 7 తరాలు మర్చిపోవు’ అని ఆడియో మెసేజ్‌లో రణ్‌వీర్‌ను హెచ్చరించింది. ‘మీ స్టాఫ్, వారి ఫ్యామిలీ మూమెంట్స్ సేకరించాం. వారిపై దాడి చేస్తే మీకు తెలిసి వస్తుందేమో’ అని గ్యాంగ్‌లోని హారీ బాక్సర్ పేరుతో వార్నింగ్ వచ్చింది.
News February 13, 2026
సిరిసిల్ల: ‘ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి’

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతిఒక్కరూ తప్పక పాటించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. సిరిసిల్ల, వేములవాడ పరిధిలోని సినారె కళామందిరాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజే కార్యక్రమాలు, టపాసులు పేల్చడం, భారీగా గుంపులు గుంపులుగా గుమి కూడడం, ఫంక్షన్ హాల్స్ లో సమావేశం ఏర్పాటు చేయడం నిషేధమన్నారు.


