News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

సిద్దిపేట: సీల్డ్ కవర్ కోసం ఎదురుచూపులు

image

హుస్నాబాద్, చేర్యాల, గజ్వేల్, దుబ్బాక మున్సిపల్ పాలకవర్గాలు ఈరోజు కొలువు తీరనున్నాయి. ఛైర్మన్ ఎవరనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సీల్డ్ కవర్‌లో ఎవరి పేరుందనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హుస్నాబాద్ నుంచి దండి లక్ష్మి పేరు ఫిక్స్ అయినట్లు సమాచారం. దుబ్బాకలో శ్రీరామ్ సంగీత, బండి శీలత మధ్య పోటీ ఉంది. గజ్వేల్‌లో కళ్యాణ్కర్ పద్మాబాయి, గంగిశెట్టి చందన, చేర్యాలలో అరుణ, గీతాంజలి పేర్లు ఉన్నాయి.

News February 16, 2026

ఆదిలాబాద్: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ డివిజన్‌లో 54 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం వివరాలు: ☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380 ☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470.

News February 16, 2026

బాపట్లకు ఆ పేరు ఎలా వచ్చిందంటే?

image

బాపట్ల పట్టణానికి ఆ పేరు పురాతన కాలం నుంచే వస్తున్న చారిత్రక నేపథ్యంతో ఏర్పడిందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న భవానారాయణ స్వామి దేవాలయం కారణంగా అప్పట్లో ఈ ప్రాంతాన్ని భవపట్టణం, భావపురిగా పిలిచేవారు. కాలక్రమేణా స్థానిక ఉచ్చారణ మార్పులతో భవపట్టణం అనే పేరు రాను రాను బాపట్లగా మారిందని చెబుతున్నారు. దీంతో భవానారాయణ స్వామివారి పేరుతోనే బాపట్లకు ఈ పేరు వచ్చిందని స్థానికులు అంటున్నారు.