News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
ఆటో డ్రైవర్ To కొత్తగూడెం మేయర్

సాధారణ ఆటో డ్రైవర్‌గా జీవితం ప్రారంభించిన మూడ్ గణేశ్ కొత్తగూడెం మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేసి ప్రజల మెప్పు పొందారు. కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా 20వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన ఆయనను మేయర్ పదవి వరించింది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారిన కొత్తగూడెం మొదటి మేయర్‌గా గణేశ్ ప్రమాణస్వీకారం చేశారు.
News February 16, 2026
T20 WC: సూపర్-8లో భారత్‌కు టఫ్ ఛాలెంజ్!

T20 WCలో టీమ్‌ఇండియా సూపర్-8లో తలపడబోయే జట్లపై స్పష్టత వచ్చింది. భారత్‌తో పాటు ఇప్పటికే S-8కి అర్హత సాధించిన సౌతాఫ్రికా, వెస్టిండీస్ ఒకే గ్రూపు(G1)లో ఉండనున్నాయి. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య పోటీ ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా కూడా వస్తే ఈ గ్రూప్ టఫ్‌గా మారనుంది. భారత్ FEB 22న SA, 26న AUS లేదా ZIM, మార్చి 1న WIను ఢీకొట్టొచ్చు. అటు గ్రూపు-2లో SL, PAK, NZ, ENG జట్లు తలపడే అవకాశముంది.
News February 16, 2026
ఆసిఫాబాద్ చైర్మెన్ ఎన్నికలో కాంగ్రెస్‌కు షాక్

ASF మున్సిపల్ ఛైర్మెన్ పీఠం కోసం కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. 7 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, స్వతంత్రులు తమకు మద్దతు ఇస్తారని భావించింది. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీంతో కాంగ్రెస్ ఛైర్మెన్ అభ్యర్థి శ్రమ వృథా అయిందని పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


