News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
HYD: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. HYD సిటీ డివిజన్‌లో 10, HYD స్కార్ట్ డివిజన్‌లో 8, HYD సౌత్ ఈస్ట్ 16, సికింద్రాబాద్ డివిజన్‌లో 54 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం నెలకు రూ.12,000-29,380, వయసు 18-40 ఉండాలి.
News February 16, 2026
మెదక్: మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రతా: ఎస్పీ

మెదక్, నర్సాపూర్, రామాయంపేట్, తూప్రాన్ మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా పరిధిలో 163 BNSS ( సెక్షన్ 144) ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.
News February 16, 2026
గద్వాల: మూడు తరాలు.. ఒకే కుటుంబం.. తుమ్మల వారి అరుదైన రికార్డు!

గద్వాల మున్సిపల్ రాజకీయంలో ‘తుమ్మల’ కుటుంబం సరికొత్త చరిత్ర సృష్టించింది. 1988లో మామ, 2000లో అత్త, 2014లో భర్త కౌన్సిలర్లుగా ఎన్నికవ్వగా.. ఇప్పుడు అదే వారసత్వంతో తుమ్మల జయలక్ష్మి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 30 ఏళ్లుగా మూడు తరాలుగా విజయం సాధిస్తూ ఈ కుటుంబం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.


