News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 17, 2026
మగువల ఆరోగ్యానికి మెంతిఆకు

మెంతి కూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళలకు ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల అనీమియా రాకుండా ఉంటుంది. అలాగే క్యాలరీలు కూడా తక్కువ కాబట్టి వెయిట్‌లాస్‌కు దోహదపడతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. బాలింతలు తింటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. మెనోపాజ్, చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఈ ఆకుల్లో విటమిన్ సి, ఎ లతోపాటు బీటా కెరొటిన్ సమృద్ధిగా ఉంటుంది.
News February 17, 2026
ఇల్లందు ఛైర్మన్ ఎన్నిక.. ఏం జరిగిందంటే..

ఇల్లందు పుర పాలకవర్గం ప్రమాణస్వీకారం కోరం లేకపోవడంతో నేటికి వాయిదా పడింది. HYD క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్ కౌన్సిలర్లు నిర్ణీత సమయానికి చేరుకోకపోవడమే ఇందుకు కారణం. కాగా మంగళవారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ముగిసింది. 24 స్థానాల్లో 21 మంది మద్దతుతో <<19165045>>కాంగ్రెస్‌కు పీఠం దక్కింది<<>>. BRS 3 స్థానాలకే పరిమితం కాగా, గెలిచిన స్వతంత్రులు, రెబల్ అభ్యర్థులు హస్తం గూటికి చేరడంతో కాంగ్రెస్ విజయం ఖాయమైంది.
News February 17, 2026
IOCL 121పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

<


