News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 18, 2026
ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త: పార్వతీపురం కలెక్టర్

ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను పారిశ్రామిక వేత్తగా తయారు చెయ్యడమే ప్రభుత్వం లక్ష్యం అని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం పార్వతీపురంలోని డిఆర్డిఏ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. మహిళలు గృహిణిగా కాకుండా, స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందాలని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో చిన్న యూనిట్ స్థాపనకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. డిఆర్డిఏ పీడీ సుధారాణి పాల్గొన్నారు.
News February 18, 2026
భారత్‌లో కనిపించిన నెలవంక.. రేపటి నుంచి ఉపవాసాలు

ఈ సాయంత్రం భారత్‌లో నెలవంక కనిపించింది. దీంతో రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభించనున్నారు. కాగా నిన్న సౌదీ అరేబియాలో నెలవంక కనిపించడంతో మిడిల్ ఈస్ట్ సహా పలు దేశాల్లో నేటి నుంచే రంజాన్ మాసం మొదలైంది.
News February 18, 2026
ఎక్కడో పుట్టి.. ఏలూరు జిల్లాలో పెరిగి.. దేశంలో నంబర్ వన్(1/1)

ఎక్కడో సౌత్ అమెరికాలో పెరిగే కోకో పంట ఖండాంతరాలు దాటి ఏలూరు జిల్లా సాగులో దూసుకుపోతుంది. జిల్లాలో 1990లో 100 ఎకరాలతో ప్రారంభం అయిన <<19178183>>కోకో సాగు<<>> ప్రస్తుతం జిల్లాలో 45 వేల ఎకరాలకు విస్తరించింది. రాష్ట్రంలో విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలలో కాస్త సాగు విస్తీర్ణం ఉన్నప్పటికీ ఏలూరు జిల్లాలో వాతావరణం అనుకూలించడంతో నాణ్యత కలిగిన కోకో పంట రైతులకు వస్తుంది.


