News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 7, 2026

బంధం విఫలం అవ్వడం మీ తప్పు కాదు

image

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ తప్పుల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.

News February 7, 2026

MHBD: నలుగురు అభ్యర్థుల ఇంటి పేరు ఒకటే!

image

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ 3వ వార్డులో ఎన్నికల పోరు విభిన్నంగా మారింది. ఎస్సీ రిజర్వుడ్ అయిన ఈ వార్డులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు జనసేన నుంచి బరిలో ఉన్న నలుగురు అభ్యర్థుల ఇంటి పేరు ‘తూర్పాటి’ కావడం విశేషం. ఒకే సామాజిక వర్గం, ఒకే ఇంటి పేరు గల అభ్యర్థులు తలపడుతుండటంతో ఓటర్లలో అయోమయం నెలకొంది. ఈ ‘తూర్పాటి’ల సమరంలో విజేత ఎవరోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

News February 7, 2026

రూ.20 లంచం.. 30ఏళ్ల పోరాటంలో విజయం.. అంతలోనే విషాదం

image

₹20 లంచం ఆరోపణలపై 30ఏళ్లు పోరాడి గెలిచిన రిటైర్డ్ కానిస్టేబుల్ ఆ మరుసటి రోజే తనువు చాలించారు. గుజరాత్ అహ్మదాబాద్‌ వేజల్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేసిన బాబుభాయ్ ప్రజాపతిపై 1996లో లంచం కేసు నమోదైంది. విచారణలో దోషిగా తేల్చిన సెషన్స్ కోర్టు 2004లో 4ఏళ్ల జైలు శిక్ష, ₹3K ఫైన్ వేసింది. ఆ తీర్పును హైకోర్టులో సవాలు చేయగా సాక్షుల వాంగ్మూలంలో పొంతన లేకపోవడంతో తాజాగా నిర్దోషిగా తేల్చింది.