News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

NGKL: తాగునీటి కోసం మందస్త చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

రాబోయే వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం ఆదేశించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యుాఎస్ ఇంజీనీర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో కలిసి తాగునీటి సరఫరా, నిల్వలు, పైప్‌లైన్ వ్యవస్థపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు.

News February 17, 2026

కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* మానవత్వం చాటుకున్న మంత్రి సత్య కుమార్
* కృష్ణా : మంత్రి ఇలకాలో లిక్కర్ పంచాయతీ
* కృష్ణా : బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా
* కృష్ణా జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
* కృష్ణా : పోలీసుల వినూతన కార్యక్రమాలు
* రాజీవ్ నగర్ కాలనీలో పేకాట శిబిరంపై దాడి
* గుడివాడ: నత్త నడకన ఫ్లైఓవర్ పనులు

News February 17, 2026

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన

image

TG: HYD, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మార్చి చివరికి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ‘నిరుపేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారి నివాస ప్రాంతాల్లో 5-10 అంత‌స్తుల్లో గృహాల నిర్మాణానికి యోచిస్తున్నాం. పూర్త‌యిన‌ డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్లకూ అర్హులను ఎంపిక చేస్తాం’ అని పేర్కొన్నారు.