News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
ఖమ్మం: రేణుకా చౌదరికి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన కమిటీ నోటీసులు జారీ చేసింది. గతేడాది డిసెంబరులో పార్లమెంటు సమావేశాల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తన పెంపుడు కుక్కను వెంట తెచ్చుకోవడంతో పాటు, సహచర సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ, ఈ నెల 23 లోపు సమాధానం సమర్పించాలని నోటీసులో స్పష్టం చేసింది.
News February 16, 2026
గాలిలో బిల్‌గేట్స్ విమానం చక్కర్లు!

AP: బిల్‌గేట్స్ విమానం ల్యాండింగ్‌కు సమస్య తలెత్తింది. విజయవాడ విమానాశ్రయం వద్ద దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ల్యాండింగ్ సాధ్యపడట్లేదు. దీంతో ఫ్లైట్ విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతోంది. సేఫ్ ల్యాండింగ్‌కు అనుకూల వాతావరణం కోసం పైలట్ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ బిల్‌గేట్స్ అమరావతిని సందర్శించాల్సి ఉంది.
News February 16, 2026
కాకినాడ: మూడేళ్ల క్రితం తండ్రి మృతి.. ఇప్పుడు కూతురు సూసైడ్!

కాకినాడ JNTU హాస్టల్‌లో టెక్కలి మండలం పాలసింగి గ్రామానికి చెందిన ఏ.అరుణ(19) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆదివారం <<19152593>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మృతురాలి తండ్రి రాము మూడేళ్ల క్రితం తిరుపతిలో భవన నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. తాజాగా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతురాలికి తల్లి సంధ్య(వ్యవసాయ కూలీ), సోదరుడు ఉన్నారు.


