News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 10, 2026
మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 106 వార్డులు ఉండగా 1,85,348 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులు 1,34,775 మంది, అశ్వారావుపేట 22 వార్డులు 16,850 మంది, ఇల్లందు 24 వార్డులు 33,723 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.
News February 10, 2026
రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP: రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉపవాసాల నేపథ్యంలో ఒక గంట ముందే ఇంటికి వెళ్లేందుకు అనుమతించింది. ఈనెల 18 నుంచి మార్చి 19 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులు డ్యూటీ నుంచి ఒక గంట ముందే ఇంటికి వెళ్లొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 10, 2026
మంచిర్యాల: పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు

సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు బుధవారం వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు ప్రభుత్వ భవనాల విద్యా సంస్థలకు, పోలింగ్ నిర్వహణ కోసం స్థానిక సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా అధికార యంత్రాంగం కృషి చేయాలని కోరారు.


