News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
కార్పొరేటర్లతో బస్సులో బయలుదేరిన రామగుండం ఎమ్మెల్యే

కరీంనగర్ నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి MLA M.S రాజ్ ఠాకూర్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బస్సులో బయలుదేరారు. నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కొద్ది గంటల్లో జరగనుంది. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఎన్నిక నగర రాజకీయాల్లో కీలకంగా మారింది. కార్యాలయం వద్ద అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అధికార పీఠం ఎవరికనే ఉత్కంఠ నెలకొంది.
News February 16, 2026
అభిషేక్ ఫ్లాప్ షో.. 6 మ్యాచుల్లో 4 డకౌట్స్

T20Iల్లో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఫ్లాప్ షో నడుస్తోంది. T20WCలో ఆడిన 2 మ్యాచుల్లోనూ సున్నాకే వెనుదిరిగారు. అటు చివరి 6 మ్యాచుల్లో 4 సార్లు డకౌట్(0, 68*, 0, 30, 0, 0,) అయ్యారు. అభిషేక్ టాలెంట్‌పై సందేహం లేకపోయినా T20WCలాంటి పెద్ద వేదికల్లో ఇలా నిలకడ చూపకపోవడం ఆందోళన కలిగించే అంశం. అటు ఈ ఫార్మాట్లో భారత ఓపెనర్లలో అత్యధికంగా రోహిత్ 10సార్లు, ఆ తర్వాత అభిషేక్&రాహుల్ 5సార్లు డకౌట్ అయ్యారు.
News February 16, 2026
NZB: ప్రారంభమైన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారాలు

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం కార్పొరేషన్ కార్యాలయంలో గెలిచిన అభ్యర్థులతో స్పెషల్ ఆఫీసర్ ప్రమాణస్వీకారం చేయించారు. మొదటగా కాంగ్రెస్ తరఫున గెలిచిన ఒకటో డివిజన్ అభ్యర్థి అగ్గు బోజన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్ఫాబెటికల్ ప్రకారం ఒక్కొక్కరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు.


