News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 13, 2026

కరీంనగర్‌: రెండో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం

image

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లెక్కింపులో బీజేపీ తన జోరును కొనసాగిస్తోంది. తొలి రౌండ్ నుంచి సాధించిన ఆధిక్యాన్ని రెండో రౌండ్‌లోనూ నిలబెట్టుకుంటూ ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తోంది. పలు డివిజన్లలో కమలం అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీతో ముందంజలో ఉండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. కాంగ్రెస్, BRS అభ్యర్థులు కొన్ని స్థానాల్లో గట్టిగా పోరాడుతున్నప్పటికీ, BJP పై చేయిగా ఉంది.

News February 13, 2026

డ్రాగన్ ఫ్రూట్‌తో మహిళలకు ఎన్నో లాభాలు

image

కలర్‌ఫుల్‌గా కనిపించే డ్రాగన్‌ ఫ్రూట్‌‌లో అనేక పోషకాలుంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. మహిళల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి లోపాన్ని భర్తీ చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ సమయంలో ఆస్టియో పోరోసిస్‌ ప్రమాదం ఎక్కువ. డ్రాగన్‌ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే మెగ్నీషియం, క్యాల్షియం అంది ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో కొల్లాజెన్‌ ఉత్పత్తి పెంచుతుందని చెబుతున్నారు.

News February 13, 2026

కోటప్పకొండలో తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనం: కలెక్టర్

image

మహాశివరాత్రి పురస్కరించుకొని ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట నుంచే త్రికోటేశ్వర స్వామి దర్శనాలు ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తిరునాళ్ల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఉదయం 9 గంటలకు మంత్రి గొట్టిపాటి ప్రభుత్వం తరఫున స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.